Monday, December 23, 2024

కువైట్ మంటలు.. 24కు చేరిన కేరళీయులు

- Advertisement -
- Advertisement -

కువైట్ సిటీలో జరిగిన అగ్నిప్రమాదంలో దుర్మరణం చెందిన కేరళీయుల సంఖ్య 24కు పెరిగింది. మొత్తం మృతుల సంఖ్య 49 కాగా వీరిలో దాదాపు 42 మంది వరకూ భారతీయ కార్మికులు , అందులో ఎక్కువగా మలయాళీలు ఉన్నట్లు తేలింది. గురువారం నిర్థారణ అయిన వార్తల మేరకు మృతులలో 24 మంది కేరళవారు అని స్పష్టం అయింది. కాగా ఈ రాష్ట్రానికే చెందిన ఏడుగురు తీవ్రగాయాలతో పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కేరళ ప్రవాసీయులకు సంబంధించిన నోర్కా విభాగం సంబంధిత విషయాలను తెలిపింది. కువైట్ అగ్ని ప్రమాద ఘటన కేరళలో పలు విధాలుగా ఆందోళనకు దారితీసింది. తమ వారి జాడ తెలియక పలువురు కలవరానికి గురవుతున్నారు.

కేరళకు చెందిన మృతుల సంఖ్య పెరుగుతోందని నోర్కా ప్రధాన నిర్వాహణాధికారి అజిత్ కొలాస్సెరి తెలిపారు. ఈ సంస్థ కువైట్‌లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసి , ఎప్పటికప్పుడు సమాచారం రాబట్టుకుంటోంది. మృతులలో కేరళకు చెందిన వారు ముందు 12 మంది అని , తరువాత 19 అని తెలిసింది. అయితే ఇప్పుడు వీరి సంఖ్య 24కు చేరుకుంది. మృతి చెందిన భారతీయులు ఇతరులు ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వారు? అనే విషయాలు డిఎన్‌ఎ పరీక్షలు ఆ తరువాతి పూర్తి స్థాయి సమాచార సేకరణతోనే వెల్లడవుతుందని అధికారులు తెలిపారు. మృతులలో అత్యధికంగా కేరళకు చెందిన వారు ఉండగా , మిగిలిన వారు రాజస్థాన్, యుపి, బీహార్ ఇతర ప్రాంతాలకు చెందిన వారని ప్రాధమికంగా వెల్లడైంది.

కింది అంతస్తు కిచెన్ సిలిండర్‌తోనే ఉపద్రవం
మంగాఫ్‌లోని అహ్మదీ గవర్నరేట్‌లోని అపార్ట్‌మెంట్‌లో మంటలకు కారణం కింది అంతస్తులో ఓ వంటగదిలో సిలిండర్ లీక్ తరువాతి పేలుడు వల్లనే అని స్థానిక అధికారులు తెలిపారు. తెల్లవారుజామున కార్మికులు అంతా కూడా గాఢ నిద్రలో ఉండగా ఘటన జరిగి మంటలు వ్యాపించాయని, దీనితోనే ఎక్కువ మంది తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని వెల్లడైంది. మంటలతో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక కొందరు ప్రాణాలు వదిలారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News