- Advertisement -
జెనీవా : ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటివరకు 4.5 మిలియన్ మంది శరణార్ధులు ఉక్రెయిన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయారని ఐక్యరాజ్యసమితి ధరణార్థుల సంస్థ వెల్లడించింది. రెఫ్యూజీస్ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని సమీక్షిస్తున్న ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ ఆదివారం మొత్తం శరణార్థుల వివరాలను వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన దగ్గర నుంచి అంటే ఫిబ్రవరి 24 నుంచి 4.504 మిలియన్ మంది శరణార్థులు ఉక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోయారరని వివరించింది. వీరిలో 2.6 మిలియన్ మంది పోలాండ్‌కు, 6,86,000 కన్నా ఎక్కువ మంది రొమేనియాకు తరలివెళ్లారని పేర్కొంది.
- Advertisement -