Sunday, December 22, 2024

టైగర్ లవ్ సారాగా నుపూర్ ఫస్ట్ లుక్‌ విడుదల…

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ‘టైగర్ దండయాత్ర’ అనే టీజర్ వైరల్‌గా మారి సినిమాపై అంచనాలని పెంచింది. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 చిత్రాలను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మేకర్స్ టైగర్ లవ్ సారాగా నూపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రైలు విండో సీట్లో కూర్చున్న నూపూర్ తన లవ్‌ని కలుసుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు ఫస్ట్ లుక్ లో కనిపిస్తోంది.

ఎత్నిక్ వేర్‌లో ఆమె చాలా బ్యూటీఫుల్‌గా వుంది. బాలీవుడ్ నటి కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్. రవితేజ కెరీర్ లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. కథకు యూనివర్సల్ అప్పీల్ ఉన్నందున మేకర్స్ దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News