Monday, December 23, 2024

నూపూర్ శర్మకు గన్ లైసెన్స్!?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత ఏడాది ఓ టివి డిబేట్ సందర్భంగా ముస్లింల ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కింది బిజెపి నుండి సస్పెండయిన ఆ పార్టీ ప్రతినిధి నూపూర్ శర్మ. ఆమెకు ఇప్పుడు గన్ లైసెన్సు ఇచ్చినట్లు ఢిల్లీ పోలీసులు గురువారం తెలిపారు. ఆమె తన రక్షణ కోసం దానిని పొందారని కూడా వారు వివరించారు. గత ఏడాది ఓ టివి చర్చలో ఆమె ప్రవక్త ముహమ్మద్(స)పై విమర్శలు గుప్పించింది. ఆ తర్వాత గల్ఫ్ దేశాలు తీవ్ర ఆక్షేపణలు తెలుపడం, దేశంలో ముస్లింలు వ్యతిరేకత చాటడంతో ఆమెను బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

నూపూర్ శర్మ ఇటీవల తన ఆత్మ రక్షణ కోసం గన్ లైసెన్సు కావాలని ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నది. తనకు ప్రాణాపాయం పొంచి ఉందని కూడా ఆమె విన్నవించుకుంది. తనకు చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనకు పిస్తోలు కావాలని ఆమె అభ్యర్థన పెట్టుకుంది. దాంతో ఆమె గురువారం గన్ లైసెన్స్ లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News