Thursday, January 23, 2025

దేశంలో జరుగుతున్నఅల్లర్లకు నూపుర్ శర్మే బాధ్యురాలు: సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -
BJP Spokesperson Nupur Sharma suspended
ప్రవక్త ముహమ్మద్(స)పై  వివాదంకు నూపుర్ శర్మ వ్యాఖ్యలే కారణం!

న్యూఢిల్లీ: నూపుర్ శర్మను, మరో బిజెపి అధికార ప్రతినిధి నవీన్ జిందాల్‌ను బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ సహా పలు దేశాలు ఈ విషయంపై భారత్‌కు అధికారిక ఆక్షేపణలు పంపాయి. అయితే, “దేశంలో అన్ని మతాలకు సమాన గౌరవం ఉంది” అని భారతదేశం నొక్కి చెప్పింది.

‘శర్మ అదుపు లేకుండా వాగడం దేశం మొత్తానికి నిప్పంటించింది’ అని సుప్రీం కోర్టు శుక్రవారం తెలిపింది.  ఆమెపై వివిధ ప్రాంతాల్లో నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లు) అన్నింటిని ఢిల్లీకి  బదిలీ చేయాల్సిందిగా ఆ 37 ఏళ్ల నాయకురాలు కోరారు.  దానికి సుప్రీం కోర్టు ‘‘ మొత్తం దేశానికి క్షమాపణలు చెప్పాలి’ అని ఆమెకు కోర్టు తెలిపింది. జ్ఞానవాపి మస్జిదు వివాదంపై  ఓ టాక్ షోలో మాట్లాడుతూ ఆమె  ప్రవక్త(స) ముహమ్మద్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

“ఉదయ్‌పూర్‌లో జరిగిన దురదృష్టకర సంఘటనకు ఆమె వాచాలతే కారణం” అని కోర్టు నొక్కిచెప్పింది. ఈ వారం ప్రారంభంలో రాజస్థాన్ జిల్లాలో ఒక దర్జీ శిరచ్ఛేదం జరిగింది.  ఇది భారీ ఉద్రిక్తతలకు దారితీసింది. భారతదేశం, విదేశాలలో పర్యాటకులలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్న ఉదయపూర్‌లో ఇప్పటికీ కఠినమైన నియంత్రణలు ఉన్నాయి.

నూపుర్ శర్మ తన ఫిర్యాదులో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. గతంలో నవీన్ జిందాల్ కూడా తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు.

న్యాయస్థానం ఆమెకు వెసలుబాటు కల్పించడానికి తిరస్కరించింది, పైగా “మీరు ఒకరిపై ఫిర్యాదు చేసినప్పుడు ఆ వ్యక్తిని అరెస్టు చేస్తారు.  కానీ ఎవరూ మిమ్మల్ని తాకడానికి సాహసించరు. అది మీ పలుకుబడిని చాటుతుంది” అని పేర్కొంది.

ప్రవక్త(స)పై  నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసిన ఫ్యాక్ట్ చెకర్, మహ్మద్ జుబైర్ – 2018లో పోస్ట్ చేసిన ట్వీట్‌పై ఢిల్లీ పోలీసులు సోమవారం అతడిని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News