Monday, December 23, 2024

వరుడు 8 కిమీ రన్నింగ్ చేసి అమీర్ ఖాన్ కూతురును వివాహమాడాడు

- Advertisement -
- Advertisement -

ముంబయి: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఐరాఖాన్ పెళ్లి వైభవంగా జరిగింది. ఐరాఖాన్ తన ప్రియుడు, ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే పెళ్లి చేసుకుంది. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఐరా, నుపుర్ రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వివాహ జరిగిన తరువాత ఓ హోటల్‌లో రిసెప్షన్ ఘనంగా జరిగింది. పెళ్లి మాత్రం చాలా విచిత్రంగా జరిగింది. వరుడు గుర్రంపై లేదా ఏదేని వాహనంపై వస్తాడు కానీ ఇక్కడి నుపుర్ మాత్ర 8 కిలో మీటర్లు జాగింగ్ చేస్తూ పెళ్లి మండపానికి చేరుకున్నారు. జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను వివాహమాడారు. ఈ నెల 8వ తేదీన ఈ జంట మరోసారి వివాహ వేడుక జరుపుకోనుంది. జనవరి 13వ తేదీన ముంబయిలో గ్రాండ్‌గా వివాహ విందు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అమీర్ ఖాన్- రీనాల దత్తాల కూతురు ఐరాఖాన్. ఈ పెళ్లి అమీర్ కాన్ ఇద్దరు భార్యలు సందడి చేశారు.  రెండో మాజీ భార్య అయిన కిరణ్ రావుకు అమీర్ ఖాన్ అప్యాయంగా నుదుటన ముద్దు పెడుతూ ఫొటోలకు పోజిచ్చాడు  పెళ్లి వేడుకకు అమీర్ ఖాన్, ఆయన మాజీ భార్యలు రీనా దత్త, కిరణ్ రావు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్-నీతా అంబానీ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలు హాజరయ్యారు. ఐరా-నుపుర్ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News