Monday, December 23, 2024

నర్సరీ మేళా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది: హరీష్

- Advertisement -
- Advertisement -

Nursary mela started in Hyderabad

హైదరాబాద్: నర్సరీ మేళా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, ఇది ఈనెల 28 వరకు కొనసాగుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.  11వ గ్రాండ్ నర్సరీ మేళాను నెక్లెస్ రోడ్ లో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుండి 100 పైగా స్టాళ్లు ఏర్పాటు చేశామని, నగర వాసులకు ఇది మంచి అవకాశమని, ఇళ్ళల్లో మొక్కలు పెంచడం వల్ల చక్కటి వాతావరణం ఏర్పరుచుకోవచ్చన్నారు.  మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలని సూచించారు.  హోమ్ గార్డెన్, టెర్రస్ గార్డెన్, వర్టికల్ గార్డెన్, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి మంచి వేదిక అవుతుందన్నారు. అరుదైన రకాల మొక్కలు ఇక్కడ ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News