Thursday, January 23, 2025

డాక్టరు మర్మాంగాలను కోసేసిన నర్సు

- Advertisement -
- Advertisement -

ఆత్మరక్షణ కోసం ఒక నర్సు తనపై అత్యాచారం జరిపేందుకు ప్రయత్నించిన డాక్టరు మర్మాంగాలను సర్జికల్ బ్లేడ్‌తో కోసివేసిన ఘటన బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. డాక్టరుతోపాటు అతని సహచరులు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. బెగుసరాయ్ జిల్లాకు చెందిన డాక్టర్ సంజయ్ కుమార్ సంజు, వైశాలి జిల్లాలకు చెందిన సునీల్ కుమార్ గుప్తా, మంగ్రా ప్రాంతానికి చెందిన అవధేష్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సమస్తిపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ గురువారం రాత్రి తన సహచరులు ఇద్దరితో కలసి ఆసుపత్రిలోనే మద్యం పుచ్చుకున్నాడు. మద్యం మత్తులో అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సును వేధించడమేగాక ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు.

ఆత్మరక్షణ కోసం ఆ నర్సు చేతికి చిక్నిన సర్జికల్ బ్లేడ్‌తో సంజయ్ మర్మాంగాలను కోసివేసింది. ఆసుపత్రి నుంచి బయటకు పారిపోవడానికి ప్రయత్నించిన ఆమెను సంజయ్ సహచరులు వెంబడించడంతో ఆమె సమీపంలోని పొలాలలో దాక్కుని ఎమర్జెన్సీ నంబర్ 112కి కాల్ చేసింది. సమాచారం అందుకున్న జిల్లా ఎస్‌పి వినయ్ తివారీ హుటాహుటిన తన బృందంతో కలసి ఆసుపత్రికి చేరుకుని డాక్టరుతోపాటు అతని సహచరులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నేర స్థలిలో రక్తంతో తడిసిన దుస్తులను, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఫిజియోథెరపిస్తుగా పనిచేస్తున్న డాక్టరుకు ఆసుపత్రిలో చికిత్స అందచేస్తున్నట్లు పోడిఎస్‌పి వినయ్ తివారీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News