Sunday, December 22, 2024

ఆపరేషన్ థియేటర్ పైకప్పు కూలి నర్సుకు తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

రైసెన్ (ఎంపి): మధ్యప్రదేశ్ రైసెన్ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ (ఓటీ)పైకప్పు కూలి 32 ఏళ్ల నర్సింగ్ ఆఫీసర్ తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం జరిగింది. నర్సింగ్ ఆఫీసర్ మమతా బథెరీ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్‌లో ఒక ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ వినోద్‌సింగ్ పర్మర్ చెప్పారు. అదే ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందారు. ఆమె ప్రమాదం నుంచి బయటపడ్డారని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పర్మర్ తెలిపారు. ఏడాది క్రితమే కొత్తభవనం నిర్మాణమైనా ఇంకా తుదిమెరుగులు దిద్దుకొంటోంది. ఆ ఆస్పత్రి కొత్త భవనం అందుబాటు లోకి వస్తే ఆపరేషన్ థియేటర్‌ను అందులోకి తరలిస్తామని పర్మర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News