Monday, January 20, 2025

హత్యచేసి తప్పించుకోవాలనుకున్న తల్లిని పట్టించిన కూతురు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఒక మహిళ తన భర్తను హత్య చేసింది. అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమ్మించేందుకు ప్రయత్నించగా , చివరకు కుమార్తె అసలు విషయం చెప్పడంతో పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశం లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 29ప కవిత అనే నర్సు, భర్త మహేష్ మధ్య ఘర్షణ జరిగింది.

ఈ నేపథ్యంలో ఆ రాత్రి నిద్రిస్తున్న భర్త గొంతునొక్కి ఊపిరాడకుండా చేసి హత్యకు పాల్పడింది. అనంతరం తాను పనిచేస్తున్న ఆస్పత్రికి భర్త మృతదేహాన్ని తీసుకెళ్లి దుప్పటితో ఉరి పోసుకుని చనిపోయినట్టు బుకాయించింది. మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు, మహేష్ మృతిపై అనుమానం తలెత్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టమ్‌లో గొంతునొక్కి హత్య చేసినట్టు తేలింది. నర్సుపై అనుమానాలు వచ్చాయి.

నర్సుకవిత 13 ఏళ్ల కూతురిని ప్రశ్నించగా, తన తండ్రిని తల్లి హత్యచేస్తుండగా, తాను చూసినట్టు ఆ బాలిక చెప్పింది. దీనిపై నిందితురాలిని ప్రశ్నించగా, తన భర్త తాగి వచ్చి తనను కొట్టేవాడని, ఆ రోజున ఘర్షణ తర్వాత తానే హత్య చేశానని ఒప్పుకుంది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మరోవైపు ఆస్పత్రిలో పనిచేసే వినయ్‌శర్మ, కవిత మధ్య సంబంధం ఉందని తేలింది. కవితభర్త హత్యలో అతడి పాత్ర కూడా ఉన్నట్టు వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు, వాయిస్ రికార్డుల ద్వారా తెలిసిందని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News