Wednesday, January 22, 2025

రాత్రి విధుల్లో ఉన్న నర్సుపై వేధింపులు

- Advertisement -
- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో రాత్రిపూట విధుల్లో ఉన్న ఓ నర్సుపై ఓ పెషేంటు లైంగిక వేధింపులకు దిగాడు. అత్యంత జుగుప్సాకరమైన ఈ ఘటన బీర్బూమ్‌లోని ల్లామ్‌బజార్ ఆసుపత్రిలో రాత్రిపూట జరిగింది. కోల్‌కతాలోని ఆర్‌జి కార్ ఆసుపత్రిలో లేడీడాక్టరుపై హత్యాచారం ఘటన దేశవ్యాప్త ఆందోళనకు దారితీసింది. ఇప్పుడు ఈ రాష్ట్రంలోనే నర్పు పట్ల చివరికి రోగి నుంచే లైంగిక వేధింపులు ఎదురుకావడం , ఆసుపత్రులలోని సిబ్బందికి భద్రతను మరింత సంక్లిష్టం చేసింది. శనివారం రాత్రి ఈ వేధింపుల ఘట్టం చోటుచేసుకుంది. రోగికి చికిత్స క్రమంలో ఈ నర్సు స్లైన్ అందిస్తూ ఉండగా ఆమెను తాకడం, బూతులకు దిగడం వంటి చర్యలతో లైంగిక వేధింపులకుదిగినట్లు వెల్లడైంది.

ఈ రోగి కుటుంబ సభ్యులతో ఆసుపత్రిలో వచ్చి చేరాడు. తనపై ఈ రోగి అత్యాచారానికి యత్నించాడని నర్సు ఆరోపించారు. డాక్టర్ల ఆదేశాల మేరకు తాను సేవలు అందిస్తూ ఉండగా ఈ వ్యక్తి తన శరీరం తడుముతూ లైంగిక కవ్వింపుల మాటలకు దిగాడని, తన రహస్య శరీరభాగాలను కూడా తాకేందుకు యత్నించాడని వాపోయింది. ఆ రాత్రి తనకు నరకం కనబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సరైన భద్రత లేకపోవడం వల్లనే ఈ రోగి ఈ విధంగా వ్యవహరించాడని తెలిపింది. పైగా విధుల్లో ఉన్న తనను ఆయన తన కుటుంబ సభ్యుల ముందే లైంగిక దాడికి యత్నించాడని, వారు కూడా కిక్కురుమనకుండా ఉన్నారని వివరించారు. ఈ ఘటన ఈ ఆసుపత్రిలో కలకలానికి దారితీసింది. ఆసుపత్రి అధికారులు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. వారు రంగంలోకి దిగి, రోగిని స్లైన్ తో పాటు అరెస్టు చేసి తీసుకువెళ్లారు.

హవ్‌డాలో మరో సంఘటన

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News