- Advertisement -
లక్నో: కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండడంతో కొందరు మానసికంగా కుంగిపోతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్ల కొరతతో పాటు ఆక్సిజన్ అందక కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. కరోనా కేసులు ఎక్కువ అవుతుండడంతో వైద్య సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. తాజాగా వైద్యుడు, నర్సు మధ్య వాగ్వాదం పెరగడంతో విచక్షణ కోల్పోయిన నర్సు వైద్యుడుపై దాడి చేసిన యుపిలో జరిగింది. వెంటనే వైద్యుడు నర్సుపై చేయి చేసుకోవడంతో పోలీసులు కొంచెం సేపు ఆపారు. నగర మెజిస్ట్రేట్ రాంజీ మిశ్రా ఇద్దరుతో మాట్లాడారు. పని భారంతో పాటు తీవ్రమైన ఒత్తిడితో గొడవ జరిగిందని మెజిస్ట్రేట్‌తో తెలిపారు. భారత్‌లో గత 24 గంటల్లో 3.23 లక్షల కరోనా కేసుల నమోదుకాగా 2771 మంది చనపోయారు. కరోనా కేసుల సంఖ్య 1.76 కోట్లకు చేరుకోగా 1.97 లక్షల మంది మృత్యువాతపడ్డారు.
- Advertisement -