మనతెలంగాణ/హైదరాబాద్:వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చిన నర్సు వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దోచుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మందమల్లమ్మ ఏరియాలో ఉంటున్న వృద్ధు దంపతులకు ఆరోగ్యం బాగా లేకుంటే స్థానికంగా ఉంటున్న అనూష నర్సుగా చేస్తోంది. వృద్ధులకు ట్రీట్‌మెంట్ చేసేది, ఒంటరిగా ఉంటుండడంతో వారి వద్ద ఉన్న బంగారు ఆభరణలపై నర్సు గత కొంత కాలం నుంచి కన్ను వేసింది. ఎలాగైనా వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు దోచుకుని ఎంజాయ్ చేయాలని ప్లాన్ వేసింది. వృద్ధ దంపతులకు పాయసంలో మత్తుమందు ఇచ్చింది, ఇది వృద్ధులపై పనిచేయలేదు. దీంతో కరోనా వ్యాక్సిన్ పేరు చెప్పి వృద్ధులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. తెలిసిన యువతి కావడంతో వృద్ధులు నమ్మి ఇంజక్షన్ తీసుకున్నారు. ఇంజక్షన్ తీసుకున్న వృద్ధులు మత్తులోకి వెళ్లారు. వెంటనే నర్సు వారి వద్ద ఉన్న 8తులాల బంగారు ఆభరణాలు దోచుకుని వెళ్లింది. మత్తు నుంచి బయటపడిన వృద్ధ దంపతులు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి దొంగ నర్సును పోలీసులు అరెస్టు చేశారు.
Nurse stolen gold from Old Couple in Meerpet