Thursday, January 23, 2025

ఇద్దరు యువకులను ఆస్పత్రిలో బంధించి కొట్టిన నర్సు

- Advertisement -
- Advertisement -

Nurse who beat up two youths in hospital

సరన్ : ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై వీడియో తీసిన ఇద్దరు యువకులను నర్సు, సిబ్బంది గదిలో బంధించి తీవ్రంగా కొట్టారు. ఈ సంఘటన బీహార్‌లో జరిగింది. ఓ నర్సు ఇద్దరు యువకులను కర్రతో కొడుతుండగా, మరో నర్సు ఆమె పక్కనే ఉన్నారు. తమను కొట్టొద్దని యువకులు ప్రాధేయపడ్డప్పటికీ వారిని నర్సు కొడుతూనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

బీహార్ లోని సరన్ జిల్లా ఛప్రా ఆస్పత్రికి ఇద్దరు యువకులు మెడికల్ సర్టిఫికెట్ కోసం వెళ్లారు. అయితే అక్కడ నెలకొన్న పరిస్థితులపై తమ ఫోన్లలో వీడియో తీయడం మొదలు పెట్టారు. ఇది గమనించిన నర్సులు , ఆస్పత్రి సిబ్బంది వారిని ఒక గదిలో బంధించారు. అనంతరం కర్రలతో కొట్టారు. ఫోన్లలో తీసిన వీడియోలను డిలీట్ చేయాలని బలవంతం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు బీహార్ ఆరోగ్యశాఖకు వీడియోను ట్యాగ్ చేస్తూ ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో మరికొందరు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఆ యువకులు నర్సులతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆస్పత్రి సిబ్బంది చేసింది సబబేనని సమర్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News