హైదరాబాద్: హోంగార్డెనింగ్‌కు కావాల్సిన అన్ని రకాల మొక్కలు ఉన్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. నర్సరీ మేళాను ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి 22వ తేదీ వరకు గ్రాండ్ నర్సరీ మేళా కొనసాగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి పలు సంస్థలకు చెందిన 150 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. స్టాళ్లలో ఆరుదైన మొక్కలు, విత్తనాలు, ఎరువులు, పరికరాల ప్రదర్శన, విక్రయాలు జరుపుతారు. నర్సరీ మేళాలో కూరగాయాలు, ఆకుకూరలు, పండ్లు, పూల మొక్కలు ప్రదర్శిస్తారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గార్డెనింగ్ ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 12751 నర్సరీలు ఏర్పాటు చేశామని, గ్రామగ్రామాన పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. నర్సరీలో పండ్లు, కూరగాయాలు, పూల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, ఈ ఏడాది తెలంగాణలో మరో 20 కోట్ల మొక్కలు నాటబోతున్నామని, తెలంగాణలో ఇప్పటి వరకు 7.6 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని, పిల్లల బర్త్ డే రోజు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. మొక్కను నాటి మంచి సమాజాన్ని నిర్మిద్దామన్నారు.