Wednesday, January 22, 2025

ఫోన్ లాక్… వికారాబాద్ శిరీష మృతి కేసులో సంచలన విషయాలు

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: జిల్లాలో సంచలనం సృష్టించిన శిరీష మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్పీ కోటిరెడ్డి పరిగి మండలం కాడ్లాపూర్ కు వెళ్లారు. శిరీష ఇల్లు, చనిపోయిన స్థలాన్ని ఎస్పీ పరిశీలించారు. శిరీష మృతికి ముందు ఇంట్లో జరిగిన గొడవపై ఆరా తీశారు. శిరీష హత్యా.. ఆత్మహత్యా అనేది ఇంకా తేలలేదని ఆయన వెల్లడించారు. పూర్తి దర్యాప్తు తర్వాతే ఎలా చనిపోయిందో వెల్లడిస్తామని పేర్కొన్నారు. శిరీష ఒంటిపై గాయాల ఆధారంగా పోస్టుమార్టం పూర్తి చేశామన్నారు.

ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చాక పూర్తి వివరాలు చెబుతామన్నారు. బయటివ్యక్తులు హత్య చేశారా.. ఇంట్లో వాళ్లా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. సెల్ ఫోన్ విషయంలో బావ అనిల్ తో గొడవ పడినట్లు తెలిసిందన్నారు. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసిందన్న ఎస్పీ.. ఫోన్ లాక్ ఉన్నందున సైబర్ క్రైమ్ కు పంపించి డాటా తీయిస్తామని చెప్పారు. ఫోన్ డాటా, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, సాంకేతిక ఆధారాల ద్వారా కేసు ఛేదిస్తామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News