Thursday, December 19, 2024

రక్తహీనతను అధిగమించేందుకు పౌష్టికాహార కిట్‌లు

- Advertisement -
- Advertisement -

Nutrition kits to overcome anemia

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రత్యేక ప్రతిభావంత కౌమార బాలికలకు పౌష్టికాహార కిట్‌లు అందజేసేందుకు మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. రాష్ట్రంలో 11 నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్న కౌమార బాలికలకు ఏకకాలంలో ఈ కిట్లు పంపిణీ చేయనున్నారు. అందించనున్నది. ముందుగా ప్రత్యేక ప్రతిభావంత కౌమార బాలికలకు అందజేయనున్నారు. రాష్ట్రంలో వీరి సంఖ్య దాదాపు పదివేల మంది ఉన్నారు. కౌమార బాలికల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కర్జూర, నెయ్యి, ప్రొటీన్ బిస్కట్లతో ప్రత్యేకంగా రూ పొందించిన కిట్‌ను 15 రోజులకు ఒకటి చొప్పున 300 రోజులకు సరిపడా పంపిణీ చేయనున్నది. జాతీయ కుటుంబ సర్వే- ప్రకారం.. యువతుల్లో రక్తహీనత శాతం ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందజేయనున్నారు. కౌమార దశలోని బాలికల ఆరోగ్య సమస్యను అధిగమించేందుకు వారికి అత్యున్నత పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు.

అంగన్‌వాడీలకు స్టీల్ ప్లేట్ల పంపిణీకి ఏర్పాట్లు

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లను పంపిణీ చేయనున్నారు. మహిళ, శిశు సంక్షే మశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 149 ఐసిడిఎస్ ప్రాజెక్టు లున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రానికి 10 చొప్పున మొత్తం 3,57,000 ప్లేట్లను పంపిణీ చేసేందుకు ఆ శాఖ రంగం సిద్ధం చేసింది.

నేడు ప్రాథమిక సమాచారం సమర్పణకు చివరి తేదీ..

అంగన్‌వాడీ సూపర్‌వైజర్ గ్రేడ్ 2 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు సోమవారం సాయంత్రం లోగా తమ ప్రాథమిక సమాచారాన్ని అందజేయాలని మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులు కోరారు. అభ్యర్థులు నిర్ణీత ప్రొఫార్మాలో ప్రాథమిక సమాచారాన్ని సమర్పించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News