Thursday, January 23, 2025

అంగన్‌వాడీ కేంద్రాలలో సకాలంలో పౌష్టికాహారం అందజేయాలి

- Advertisement -
- Advertisement -

నారాయణపేట ప్రతినిధి : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులకు సకాలంలో పౌష్టికాహరం అందజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అంగన్‌వాడీ కేంద్రాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని సకాలంలో టీచర్లు కేంద్రానికి వెళ్లి బోధించాలన్నారు.

త్వరలో అంగన్‌వాడీ టీచర్లుకు ట్యాబులు అందజేయనున్నట్లు తెలిపారు. సకాలంలో విధులకు హాజరు కాని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్యాం, మ్యామ్ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గర్భిణీలలో అనీమియా నిరోధానికి టార్గెట్ ప్రకారం పూర్తి చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను రెగ్యులర్‌గా పర్యవేక్షించాలని అన్నారు. అనంతరం ప్రీ స్కూల్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిడబ్లూఓ వేణుగోపాల్ , సిడిపిఓలు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News