Friday, November 22, 2024

చిన్నారులకు మధ్యాహ్నం భోజనంలో పోషక ఆహారం

- Advertisement -
- Advertisement -

Nutritious food at lunch for children

ప్రభుత్వ స్కూళ్లో వారానికి మూడు రోజులు గుడ్డు
రోజు రోజుకు బడుల్లో పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
కార్పొరేట్ స్థాయిలో విద్య అందిస్తామంటున్న విద్యాశాఖ

హైదరాబాద్: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం బోజనంలో ఈఏడాది నుంచి చిన్నారులకు పోషక పదార్దాలతో కూడిన ఆహారం అందించనున్నట్లు ప్రధానోఫాధ్యాయులు పేర్కొంటున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులు ఆర్దిక ఇబ్బందులు పడటంతో పాటు ఆంగ్ల బోధన 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రవేశపెట్టడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం రెండు రోజుల కిత కొత్త మెనూ విడుదల చేసింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు ఒకరికి రూ. 4.97 చొప్పను భోజనం కోసం ప్రభుత్వం ఇస్తోంది. ఆరో తరగతి నుంచి ఏడో తరగతి వారికి రూ. 7.45, ఎనిమిది నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు రూ. 9.54పైసలు చొప్పన మంజూరు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారులు వెల్లడించారు. అవి కాకుండా వారంలో మూడు రోజుల పాటు గుడ్డు ఇచ్చేందుకు రూ. 12 అదనంగా కేటాయిస్తోంది. అయిన ప్రస్తుతం మార్కెట్ల ధరలను పోల్చితే ఈడబ్బులు సరిపోవని వంట నిర్వహకులు చెబుతున్నారు.

బోజనం మోను సోమవారం గుడ్డు, వెజిటేబుల్ కర్రీ, మంగళవారం ఆకు కూరతో పప్పు, బుధవారం గుడ్డు వెజిటేబుల్ కర్రి, గురువారం వెజిటేబుల్ కర్రీ, సాంబారు, శుక్రవారం గుడ్డు, వేజిటేబుల్, శనివారం వెజిటేబుల్ బిర్యానీ అందిచనున్నట్లు వివరిస్తున్నారు. జిల్లాలో 689 ప్రభుత్వ పాఠశాలుండగా వాటిలో 1,17, 500 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి పోషక విలువతో కూడిన భోజనం అందించి చదువులకు ఆటంకం లేకుండా చూస్తామని ఆయా పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. చాలా స్కూళ్లలో వంట చేసేందుకు గదులు సక్రమంగా లేవని, మనబస్తీ మనబడి పథకం ద్వారా కిచెన్ షెడ్లు త్వరగా నిర్మిస్తున్నట్లు, విద్యార్థులకు మంచినీరు. పర్నెచర్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. బడిబాట కార్యక్రమం ద్వారా స్దానిక బస్తీల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేసి గతేడాది కంటే ఈసారి విద్యార్థుల సంఖ్య పెంచి సర్కార్ బడుల్లో చిన్నారులు సందడి చేసేలా పూర్వవైభవం తీసుకొస్తామంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News