Monday, January 20, 2025

మనసుని హత్తుకునే పాట..

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతో పనిచేసిన పాపులర్ చైల్ ఆర్టిస్ట్, యంగ్ హీరో దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ తో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ’సిద్ధాంతం’ పాటని విడుదల చేశారు. సినిమాలో చాలా కీలకమైన ఈ పాటని రధన్ పవర్ ఫుల్ ఎమోషనల్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. బాలాజీ రాసిన సాహిత్యం కథలోని లోతుని తెలియజేస్తుంది. సింగర్ శరత్ సంతోష్ మనసుని హత్తుకునేలా పాటని ఆలపించాడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ పతాకాలపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News