Monday, December 23, 2024

‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ మెలోడి సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. చిరంజీవి టీజర్, రవితేజ టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాస్ పార్టీ సాంగ్ 28 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి రీల్ మేకర్స్ కు ఫేవరెట్ గా మారింది.తాజాగా సెకండ్ సింగిల్ ‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ను మేకర్స్ విడుదల చేశారు.

Nuvvu Sridevi Nenu Chiranjeevi lyrical Song released

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లీడ్ పెయిర్ అందమైన కెమిస్ట్రీని వర్ణిస్తూ పాటను స్వయంగా రాసి అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. జస్‌ప్రీత్ జాస్, సమీరా భరద్వాజ్‌ల డైనమిక్ వోకల్స్ తో ఎనర్జీని డబుల్ చేశారు. ఈ పాట ఆడియన్స్ మెస్మరైజ్ చేస్తోంది. ఇందులో చిరంజీవి స్టైలిష్‌ మేకోవర్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక, శృతి హాసన్ రంగురంగుల చీరలలో కనువిందు చేసింది. క్రేజీ కిరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు డ్యాన్స్‌లు సమకూర్చారు. ఈ సినిమా షూటింగ్ యూరప్‌లో పూర్తి చేసుకొని చిరంజీవి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

Nuvvu Sridevi Nenu Chiranjeevi lyrical Song released

మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా.. కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News