Monday, December 23, 2024

‘మైఖేల్’ నుండి సిద్ శ్రీరామ్ పాడిన ‘నువ్వుంటే చాలు’ సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

యంగ్ స్టార్ సందీప్ కిషన్ తన మొదటి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’ టీజర్‌ తో ఆడియన్స్ కు ఆడ్రినలిన్ రష్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పితో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభిస్తూ ‘నువ్వుంటే చాలు’ ఫస్ట్ సింగిల్‌ ని విడుదల చేశారు. సామ్ సిఎస్ కంపోజ్ చేసిన ‘నువ్వుంటే చాలు’ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని అందించిన సాహిత్యం మనసుల్ని ఆకట్టుకుంది.

దివ్యాంశ కౌశిక్ తన ఇంటి గేటు తెరచి సందీప్‌కి రొమాంటిక్ సిగ్నల్స్ ఇవ్వడంతో పాట ప్రారంభమవుతుంది. అతను తికమకలో ఉన్నప్పుడే ఆమె అతన్ని ఆహ్వానించడం, ఆ తర్వాత వీరిద్దరూ రొమాంటిక్ మూడ్‌లోకి రావడం చాలా అందంగా గా ప్రజంట్ చేశారు. సందీప్, దివ్యాంశల అద్భుతమైన కెమిస్ట్రీ ఆకట్టుకుంది. లిప్ లాక్ కూడా ఉంది. కంపోజిషన్, వాయిస్ లానే విజువల్స్ చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. కాగా, ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News