హన్మకొండ: జిల్లాలో పది నూతన కోర్టుల భవన సముదాయాన్ని సిజేఐ జస్టీస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించిన పది కోర్టుల సముదాయాన్ని, పోక్సో కోర్టు, ఫ్యామిలీ కోర్టును ఆదివారం ఉదయం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టీస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ”శిథిలావస్థలో ఉన్న కోర్టులను పునరుద్దరించాలని కేంద్రాన్ని కోరాం. కేంద్రం నుంచి ఇంకా సానుకూలమైన స్పందన రాలేదు. పార్లమెంట్ సమావేశాల్లోనైనా దీనిపై చట్టం తీసుకొస్తారని ఆశిస్తున్నా. కోర్టుల్లో మౌలిక వసతులు ఉంటేనే పేదలకు న్యాయ సేవలు అందుతాయి. న్యాయ వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం మద్దతివ్వడానికి సంతోషిస్తున్నా. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా తెలంగాణ ప్రభుత్వం కొర్టులను నిర్మిస్తోంది. రాజకీయాల్లో న్యాయవాదుల సంఖ్య తగ్గిపోతుంది. న్యాయవాదుల పట్ల సమాజంలో గౌరవం ఉంది. కుటుంబ అవసరాల కోసం వృత్తికే న్యాయవాదుల పరిమితమవుతున్నారు. న్యాయవాదులు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నా. కొవిడ్ తో ఉపాధి కోల్పోయిన న్యాయవాదులకు ఆర్థిక సాయం చేయాలి” అని పేర్కొన్నారు.
NV Ramana Inaugurates Court building in Hanamkonda