కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రన్యారావు తన స్నేహితుడితో కలిసి ఏకంగా 26 సార్లు దుబాయ్ కి రాకపోకలు సాగించింది.ఒక్కో సారి ఉదయం వెళ్లి అదేరోజు బంగారం కొనుక్కుని తిరిగి వచ్చేవారని దర్యాప్తులో తేలింది. రన్యారావే తరుణ్ కు దుబాయి నుంచి హైదరాబాద్ కు విమానం టికెట్లు బుక్ చేసింది. విచారణ కోసం తరుణ్ ను తమ కస్టడీకి ఇవ్వాలని అదికారులు కోరుతున్నారు.డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ తమ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలను కోర్టుకు నివేదించింది. రావు ఆమె ఫ్రెండ్ తరుణ్ రాజు దుబాయికి 26 సార్లు ప్రయాణం
చేసి బంగారం స్మగ్లింగ్ చేసేవారని సాక్ష్యాలు ఉన్నట్లు డిఆర్ ఐ తెలిపింది. రన్యారావు, తరుణ్ ఒక్కోసారి ఒకరోజులోనే దుబాయికి వెళ్లి, వెనక్కి తిరిగి వచ్చే వారని, ఇది అనుమానాలకు తావు ఇచ్చిందని అధికారులు తెలిపారు.తరుణ్ రాజుకు బెయిల్ ఇవ్వరాదని వారు కోరారు. బెంగళూరు విమానాశ్రయంలో భారీ ఎత్తున బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా రన్యారావును అరెస్ట్ చేసిన తర్వాత కొద్ది గంటల్లోనే తరుణ్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు.
రన్యారావు, తరుణ్ మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, తరుణ్ రాజు దుబాయి నుంచి హైదరాబాద్ కు వచ్చే విమానం టికెట్లను రన్యారావే బుక్ చేసేదని,అతడి అకౌంట్లో డబ్బు వేసేదని కూడా సాక్ష్యాలు చెబుతున్నాయన్నారు. స్మగ్లింగ్ రాకెట్ లో వీరిద్దరు భాగస్వాములే అని దర్యాప్తు అధికారులు చెప్పారు.నటి రన్యారావు 2023- 2025 మధ్య దుబాయికి ఏకంగా 52 ట్రిప్ లు వెళ్లారని, 26 సార్లు తరుణ్, రన్యారావు కలిసి వెళ్ళారని స్పష్టమైంది.తరచు వారు చేస్తున్న పర్యటనల కారణంగా వారి బంగారం స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారన్న అనుమానాలు కలిగాయి. బెంగళూరు విమానాశ్రయంలో గోల్డ్ స్వాధీనం తర్వాత
తరుణ్ కోసం పోలీసులు గాలించారు. మార్చి 8న తరుణ్ దేశం నుంచి తప్పించుకునేందుకు విఫలయత్నం చేశారు. అది ఫలించక పోవడంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చాడు.రాజుకు అమెరికా పౌరసత్వం కూడా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
దుబాయిలో తరుణ్ రాజు ఆర్థిక లావాదేవీలు, బంగారం కొనడానికి వారి ఎలా చెల్లింపులు చేశారు. అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్ వర్క్ తో వారికి ఉన్న లావాదేవీలు వంటి పలు విషయాలను లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.