Wednesday, January 22, 2025

భారత్‌లో ఎఐ కోసం ఎన్‌విడియా, రిలయన్స్ మధ్య డీల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత్‌లో ఎఐ సూపర్ కంప్యూటర్లను అభివృద్ధి చేసేందుకు గాను అమెరికా టెక్నాలజీ కంపెనీ ఎన్‌విడియాతో రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా దేశంలో ఎఐ మౌలికసదుపాయాలపై ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. భారత్‌లో వేగవంతమైన సూపర్‌కంప్యూటర్ కంటే శక్తివంతమైన ఎఐ దిశగా పనిచేయనున్నామని ఇరు కంపెనీలు ప్రకటించాయి. ఈ ప్రకటన చేయడానికి ముందు ఎన్‌విడియా ఫౌండర్, సిఇఒ జెన్సెన్ హాంగ్ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.

సెమీకండక్టర్ తయారీలోకి రిలయన్స్

దేశంలో అత్యంత ధనిక పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సెమీకండక్టర్ తయారీ రంగంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా రిలయన్స్ సెమీకండక్టర్‌ల తయారీని ప్రారంభించాలని యోచిస్తోంది. తద్వారా కంపెనీ తన సరఫరా గొలుసు అవసరాలను తీర్చనుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేక విదేశీ చిప్ తయారీ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ఈ వార్తల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ 0.78 శాతం లాభపడింది.

Also Read: చైనా ప్రాతినిధ్యంపై టిబెటియన్ల నిరసనలు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News