హైదరాబాద్: నైకా స్కిన్‌ఆర్‌ఎక్స్ యొక్క విటమిన్ సీ శ్రేణికి తాజా జోడింపు–10% విటమిన్ సీ సెరమ్ తో 5% నియాసినమైడ్ జోడించి మీ చర్మాన్ని పునరుజ్జీవింపజేయండి. ప్రకాశవంతంగా మలచండి మరియు ధృడంగా చేయండి. ఎలాంటి సందేహం లేకుండా విటమిన్ సీ చర్మ సంరక్షణకు ఓ నిధి! ఏజింగ్ లక్షణాలను తగ్గించడం మొదలు స్కిన్ టోన్ మెరుగుపరచడం వరకూ, ఇది అత్యద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. చర్మ కణాలకు యాంటీ ఆక్సిడెంట్స్‌నూ అందిస్తుంది. విస్తృతశ్రేణిలో విటమిన్ సీ మరియు నియాసినమైడ్, ఫెర్యులిక్ యాసిడ్ వంటి పదార్ధాల చక్కదనంతో సమృద్ధి చేయబడిన స్కిన్‌ఆర్‌ఎక్స్ 10% విటమిన్ సీ సెరమ్, మీ చర్మ సంరక్షణ ప్రయాణం తక్షణమే ప్రారంభించేందుకు చక్కటి భాగస్వామిగా నిలుస్తుంది. అది మీరు తొలిసారిగా వినియోగించినా లేదంటే నిష్ణాతులైనా ఇది మీకు తోడ్పడుతుంది. ఇది అత్యంత శక్తివంతమైన, ఆల్ ఇన్‌ఒన్ సొల్యూషన్. దీనిని క్లీనికల్‌గా పరీక్షించడంతో పాటుగా సూత్రీకరించడం వల్ల మీకు చక్కటి తేమతో ప్రకాశవంతమైన చర్మం అందిస్తుంది.
ఈ నూతన సెరమ్, శాస్త్ర ఆధారిత పరిష్కారం. దీనిని 10% విటమిన్ సీతో అభివృద్ధి చేశారు. ఇది మీ చర్మం ప్రకాశవంతంగా మార్చడంతో పాటుగా ఫోటో డ్యామేజీని సరిచేస్తుంది మరియు కొల్లాజెన్ సింథసిస్‌ను ప్రోత్సహిస్తోంది. తద్వారా సున్నితమైన చర్మం కలిగి ఉన్నప్పటికీ తొలిసారి వినియోగించే వారికి ఇది అత్యంత అనుకూలంగా ఉంటుంది. డెర్మటాలజిస్ట్‌లు సూచించిన రీతిలో క్లీనికల్ యాక్టివిటీలు అయినటువంటి 3–O ఎథల్ అస్కోర్బిక్ యాసిడ్ మరియు నియాసినమైడ్ తగినంత మోతాదులో ఇది కలిగి ఉంది. స్వచ్ఛమైన విటమిన్ సీకి అతి దగ్గర రూపం 3–O ఎథల్ అస్కార్బిక్ యాసిడ్. చర్మ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. దీనిలో 5% నియాసినమైడ్, ఫెర్యులిక్ యాసిడ్ సైతం ఉన్నాయి. ఇవి దీనిని మెరుగైన పరిష్కారంగా తీర్చిదిద్దడంతో పాటుగా హైపర్ పిగ్మంటేషన్, ఫైన్ లైన్స్. ముడతలు, మొదటిమల గుర్తులు, మచ్చలు తొలగించడంలో సహాయపడుతుంది. ఈ నీటి ఆధారిత , అంటుకోనట్టి పరిష్కారం దీనిని అతి తేలికగా మలచడంతో పాటుగా వేగంగా చర్మం పీల్చుకుంటుంది.
మీరు మీ చర్మ సంరక్షణ ప్రయాణం వేగవంతంగా ప్రారంభించినప్పుడు, మీ చర్మానికి ఏది అత్యుత్తమగా ఉపయోగపడుతుందో తెలుసుకోవడం ముఖ్యం. అతి తక్కువ గాఢత కలిగిన సొల్యూషన్‌తో ప్రారంభించి, మరింత క్లిష్టమైన, అత్యాధునిక పదార్ధాలైనటువంటి నైకా స్కిన్‌ఆర్‌ఎక్స్ 20% విటమిన్ సీ సెరమ్ వంటి వాటివైపు వెళ్లాలి. తమ స్కిన్‌కేర్ రొటీన్స్‌ను మార్చుకునే వారికి దీనిని సూచించడమైనది. దీనిలో అత్యధిక గాఢత కలిగిన విటమిన్ సీతో పాటుగా 1% హైయల్యురోనిక్ యాసిడ్ +0.5% ఫెర్యులిక్ యాసిడ్ ఉంటాయి.పర్యావరణ పరమైన కారణాల చేత పాడైన చర్మానికి నైకా స్కిన్‌ఆర్‌ఎక్స్ విటమిన్ సీ సెరమ్స్ మీ స్కిన్‌కేర్ రొటీన్‌ను శక్తివంతం చేస్తుంది. ఇది చర్మంలో తేమ స్ధాయి పెంచడంతో పాటుగా చర్మం సహజసిద్ధంగా ప్రకాశించేలా చేస్తుంది. విటమిన్ సీ సెరమ్‌ను సన్‌స్ర్కీన్‌తో జతకలపడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
నైకా బ్రాండ్స్ సీఈఓ రీనా చాబ్రా మాట్లాడుతూ ‘‘ విటమిన్ సీ ని ప్రపంచవ్యాప్తంగా అభిమానిస్తుంటారు. కాకపోతే మీ చర్మానికి తగిన మొత్తంలో దానిని ఎంచుకోవడం కీలకం. నైకా స్కిన్‌ఆర్‌ఎక్స్ 20% విటమిన్ సీ సెరమ్ ఆవిష్కరించిన తరువాత మేము మొదటిసారిగాతమ స్కిన్‌కేర్ ప్రయాణంలో భాగంగా వినియోగించే వారికి అనువుగా ఉత్పత్తులను తీర్చిదిద్దాలనుకున్నాము. ఈ శక్తివంతమైన పదార్ధాల జాబితాతో, 10% విటమిన్ సీ తో పాటుగా 5% నియాసినమైడ్ సెరమ్ ఖచ్చితంగా తొలిసారి చర్మ సౌందర్య ఉత్పత్తులు వాడుతున్న వారికి పూర్తి అనుకూలంగా ఉంటుంది. దీనితో అతి సాధారణ చర్మ సమస్యలైనటువంటి నిస్సత్తువ, పిగ్మంటేషన్ సమస్యలు రాకుండా కాపాడుతుంది’’ అని అన్నారు.
ఈ 5–ఇన్–1 పవర్ సెరమ్‌లో…
10% విటమిన్ సీ – ఫోటో డ్యామేజీని సరిచేయడంతో పాటుగా కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచడం ద్వారా ప్రకాశవంతమైన చర్మం పొందడంలో సహాయపడుతుంది.5% నియాసినమైడ్–ఆయిల్‌ను నియంత్రించడంలో సహాయపడటంతో పాటుగా యువీ కిరణాల కారణంగా వచ్చే పిగ్మంటేషన్‌ను నివారిస్తుంది. అంతేకాదు, మచ్చలు తగ్గించడంలో సహాయపడి, చర్మ సౌందర్యం మెరుగుపరుచుకోవడంలోనూ తోడ్పడుతుంది. 0.25% ఫెరులిక్ యాసిడ్ – యాంటీ ఆక్సిడెంట్‌లు అధికంగా కలిగిన పదార్ధాలను కలిగి ఉండటంతో పాటుగా ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. విటమిన్ సీ సామర్ధ్యం మెరుగుపరిచి ఏజింగ్ సమస్య లక్షణాలు తగ్గిస్తుంది. హైయల్యురోనిక్ యాసిడ్– హ్యుమెక్టాంట్ లక్షణాలు కలిగిన యాక్టివ్ ఇంగ్రీడియెంట్. చుట్టుపక్కల తేమ పీల్చుకుని చర్మంలో నిల్వ చేస్తుంది. బొద్దుగా మరియు మృదువుగా ఉండే చర్మాన్ని బహిర్గతం చేయడానికి మృదువైన ఫైన్‌లైన్స్ తోడ్పడతాయి.
సికా ఎక్స్‌ట్రాక్ట్ – యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లెమ్మటరీ మెడిసినల్ హెర్బ్ అది. ఇది సున్నితమైన చర్మం కాపాడటంతో పాటుగా ఏజింగ్ సమస్యలతో పోరాడుతుంది. చికాకు తగ్గించడంతో పాటుగా చర్మం ఎర్రబారడం తగ్గిస్తుంది. చర్మపు అవరోధాలు బలోపేతం చేస్తుంది. ఎన్నో తరాలుగా ఆసియాలో సంప్రదాయ ఆసియా ఔషదాలలో వాడుతున్నారు. పాడైన చర్మం చికిత్సలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని రకాల చర్మాలకూ ఇది తగినరీతిలో ఉంటుంది!. నైకా స్కిన్‌ఆర్‌ఎక్స్ 10% విటమిన్ సీ సెరమ్, 5% నియాసినమైడ్‌తో కూడి ఉండటంతో పాటుగా డెర్మటాలజికల్‌గా పరీక్షించారు. ఫ్రాగ్నాన్స్, ఆల్కహాల్ ఫ్రీ ఇది. అంతేకాకుండా దీనిలో పారాబెన్స్,సిలికాన్స్ కూడా ఉండవు. ఇది నైకా వెబ్‌సైట్/యాప్ తో పాటుగా భారతదేశ వ్యాప్తంగా స్టోర్లలో 30 మిల్లీ లీటర్ల ప్యాక్ 699 రూపాయల ధరలో లభ్యమవుతుంది.
వివరణ: 3.O ఎథిల్ అస్కార్బిక్ యాసిడ్‌ను క్లీనికల్‌గా నిరూపించడం జరిగింది. 30 రోజుల పాటు ఏకధాటిగా వాడటం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
Nykaa SKINRX 10% Vitamin C Face Serum for Brightness