Monday, December 23, 2024

ఓ అమ్మ కథ

- Advertisement -
- Advertisement -

O Amma Katha movie

శ్రీవాసవి మూవీస్ పతాకంపై కె.హరనాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకశ్వరరావు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘మాతృదేవోభవ‘. ’ఓ అమ్మ కథ’ అన్నది ఉప శీర్షిక. వెయ్యి సినిమాలకు పైగా నటించిన సీనియర్ నటీమణి సుధ తన కెరీర్ లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్-, అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ప్రముఖ రచయిత మరుదూరి రాజా సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, పోసాని, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మాతృదేవోభవ’ ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో టైటిల్ పాత్రధారిణి సుధ, నిర్మాతలు చోడవరపు వెంకశ్వరరావు-, ఎమ్ ఎస్.రెడ్డి, దర్శకులు హరనాథ్ రెడ్డి, ఈ చిత్రంలో నటించిన చమ్మక్ చంద్ర, జెమిని సురేష్, శ్రీహర్ష, కీర్తి, సత్యశ్రీ పాల్గొన్నారు. సుధ మాట్లాడుతూ “ఇది నా సినిమా… అని నేను గర్వంగా చెప్పుకునే సినిమా ‘మాతృదేవోభవ’. సకుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”అని అన్నారు. చిత్ర దర్శకుడు హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ మాతృదేవోభవ వంటి సందేశాత్మక చిత్రంతో దర్శకుడిగా మారుతుండడం గర్వంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News