- Advertisement -
విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతమైన తమిళ చిత్రం ‘ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్’. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హక్కులను భారీ ధరకి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ “ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటన హైలైట్గా ఉంటుంది. నిహారిక కొణిదెల ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది”అని తెలిపారు.
- Advertisement -