ప్రధాని మోడీపై శశి థరూర్ విసుర్లు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కన్నా ‘ఓ మిత్రో’ ఎంతో ప్రమాదకరమని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విచ్ఛిన్నకర, విద్వేషపూరిత రాజకీయాలకు ప్రభుత్వం పాల్పడుతోందంటూ తరచు ఆరోపణలు చేసే శశి థరూర్ సోమవారంతాజాగా ప్రధాని మోడీ తన ప్రసంగానికి ముందు పలికే మిత్రులారా(మిత్రో) అనే పదాన్ని ప్రస్తావిస్తూ ఒమిక్రాన్ కన్నా ఓ మిత్రో అత్యంత ప్రమాదకరమైనదని, ఏకీకరణ, విద్వేష వ్యాప్తి, రాజ్యాంగంపై దాడులు, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యల పర్యవసానాలు ప్రస్త్తుతం మన నిత్యం చేస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ వైరస్ కన్నా తక్కువ ప్రమాదకారి మరొకటి లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాగా..శశి థరూర్ వ్యాఖ్యలపై బిజెపి అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. కొవిడ్ వైరస్‌ను రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ఉంచలేదా అని ఆయన ప్రశ్నించారు.