Monday, December 23, 2024

ఉదయం ప్రమాణం.. సాయంత్రం పదవీ విరమణ !

- Advertisement -
- Advertisement -
నేడు హైకోర్టు తాత్కాలిక సిజెగా నవీన్‌రావు బాధ్యతలు
న్యాయ చరిత్రలో అరుదైన సన్నివేశం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అత్యున్నత న్యా యస్థానం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నం దిమేడారంకు చెందిన పొనుగోటి నవీన్ రావును నియమి స్తూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శుక్రవా రం ఉదయం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పోనుగొటి నవీన్ రావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే పదవీకాలం ముగియడంతో శుక్రవారం సాయంత్రమే పదవి వి రమణ కూడా చేయనున్నారు. న్యాయ చరిత్రలో ఆరుదైన రికార్డు. ధర్మారం మండలం నంది మేడారంకు చెందిన నవీ న్ రావ్ సుదీర్ఘకాలం న్యాయమూర్తిగా పనిచేశారు. న్యాయవ్యవస్థలో తొలిసారిగా తెలుగులో పూర్తిస్థాయి తీర్పును వెలువరించి రికార్డు సృష్టించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పదవి విరమణ చేయడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News