అమరావతి: శాసన సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ఎంఎల్‌ఎల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి టిడిపి, జనసేన, వైఎస్‌పి, బిజెపి సభ్యుల చేత ఎంఎల్‌ఎలుగా ప్రమాణం చేయించారు. సిఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, టిజి భరత్, కందుల దుర్గేష్, ఎన్, ఎండి ఫరూక్, బిసి జనార్థన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, లోకేష్, నాదెండ్ల మనోహర్, నారాయణ, పార్థసారిథి, నిమ్మన రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవి కుమార్, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, సవిత, డిబివి స్వామి, కొండపల్లి శ్రీనివాస్, వాసం శెట్టి, సుభాష్, వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డిలు ఎంఎల్‌ఎలుగా ప్రమాణం చేశారు.
వెంకటపాలెంలో ఎన్‌టిఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం అసెంబ్లీకి వెళ్లిన సభ మెట్లకు బాబు ప్రణమిల్లారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రెండున్నర సంవత్సరాలు తరువాత సభలో అడుగుపెట్టాడు. కుటుంబ సభ్యులపై అనాటి అధికార పక్షం అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో చంద్రబాబు హింసించింది. నాడు సభ నుంచి అవేదనతో బాబు బయటకు వెళ్లారు. సిఎంగానే మళ్లీ శపథలో అడుగుపెడుతానని2021లో చంద్రబాబు శపథం చేశారు. శపథం నిలబెట్టుకుంటూ అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టారు. నాలుగోసారి సిఎంగా చంద్రబాబు శుక్రవారం సభకు వచ్చారు.