Monday, January 20, 2025

బిజెపిలోకి యుపి బిసి నేత రాజ్‌భర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒబిసి నేత ఓమ్ ప్రకాశ్ రాజ్‌భర్ బిజెపిలో చేరనున్నారు. ఆయన ఆదివారం తమ నిర్ణయాన్ని ప్రకటించారు. అంతకు ముందు రాజ్‌భర్ దేశ రాజధానిలో బిజెపి నేత, హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. యుపిలో బిజెపి బలోపేతానికి ఈ బిసి నేత రాక దోహదం చేయనుంది. ఓమ్ ప్రకాశ్ రాజ్ ఆధ్వర్యంలో సుహల్దేవ్ భారతీయ సమాజ్‌పార్టీ (ఎస్‌బిఎస్‌పి) ఇప్పుడు తమ ఎన్‌డిఎలో చేరనుందని ఆ తరువాత అమిత్ షా ఫోటోతో పాటు ట్వీటు వెలువరించారు. ఎన్‌డిఎలోకి ఇది ఆయన పునఃప్రవేశం కానుంది. ఉత్తరప్రదేశ్‌లో రాజ్‌భర్‌ల సంఖ్య గణనీయంగా ఉంది. ఇంతకు ముందు ఆయన యుపిలో బిజెపి మిత్రపక్షంగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడిపోయి, సొంతంగా బరిలోకి దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News