Sunday, December 29, 2024

ఒబెరాయ్ గ్రూప్ అధినేత పృథ్వీ రాజ్‌ సింగ్‌ ఒబెరాయ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఆతిథ్యరంగ దిగ్గజం, ఒబెరాయ్ గ్రూప్ అధినేత పృథ్వీ రాజ్‌ సింగ్‌ ఒబెరాయ్ (94) కన్నుమూశారు. మంగళవారం ఉదయం పృథ్వీరాజ్ సింగ్ తుదిశ్వాస విడిచారరని ఒబెరాయ్‌ గ్రూప్‌ వెల్లడించింది. ఇవాళ ఉదయం ఒబెరాయ్ గ్రూప్ ఎమెరిటస్ చైర్మన్ పిఆర్ఎస్ ఒబెరాయ్ శాంతియుతంగా కన్నుమూశారని తాము విచారంలో ఉన్నామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన మరణం ఒబెరాయ్‌ గ్రూప్స్‌తోపాటు దేశవిదేశాల్లోని ఆతిథ్య రంగానికి తీరని లోటు’ అని ఓ ప్రకటనలో ఆ సంస్థ తెలియజేసింది. ఒబెరాయ్‌ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు ఒబెరాయ్‌ గ్రూప్స్‌ తన ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీలోని కపషేరా ప్రాంతంలో భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్‌ ఫామ్‌లో అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News