నాగ్ పూర్: నిర్మాణంలో ఉన్న భవనంలో మద్యం తాగొద్దన్నందుకు ఓ వ్యక్తిని కొట్టి చంపిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ ప్రాంతం వాడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర ఓ వ్యక్తి మద్యం తాగుతుండగా ఇక్కడ ఆల్మహాల్ తాగొద్దని పాల్ అనే అతడు సూచించాడు. మద్యం ప్రియుడు వెంటనే తన గ్యాంగ్ కు ఫోన్ చేసి ఇక్కడికి రావాలని సూచించాడు. ఐదుగురు దుండగులు వచ్చి పాల్ పై దాడి చేశారు. అక్కడ ఉన్న కూలీలు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికి సుత్తితో పలుమార్లు పాల్ తలపై కొట్టడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అగర్వాల్ అనే నిందితుడిపై పదుల సంఖ్యల కేసుల ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. నిందితుల పేర్లు చారుదత్త నర్బరియా, ఆకాశ్ చవాకే, బింగో అగర్వాల్, తేజాస్ చవాన్, యాస్ టెక్కమ్ గా గుర్తించారు.