Wednesday, January 22, 2025

ప్రధాని మోడీపై పోస్టర్లు: ఢిల్లీలో 100 ఎఫ్‌ఐఆర్‌లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని అంతటా ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలతో వేసిన పోస్టర్లకు సంబంధించి వందకు పైగా ఎఫ్‌ఐఆర్‌లను నమోదుచేసిన పోలీసులు ఇప్పటివరకు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. మోడీ హటావో, దేశ్ బచావో వంటి రాతలతో ఈ పోస్టర్లు వెలిశాయి.

అయితే పోస్టర్లపై అవి ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ పేరు కాని, ముద్రించిన వారి పేరు కాని పోస్టర్లలో లేదని ప్రత్యేక సివి దీపేంద్ర పాఠక్ తెలిపారు. నగర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి బయల్దేరిన ఒక వాహనాన్ని అడ్డుకుని సోదా చేయగా అందులో కొన్ని పోస్టర్లు లభించాయని, ఈ సందర్భంగా కొందరిని అరెస్టు చేశామని సిపి తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు సాగుతున్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News