Monday, December 23, 2024

చివరి వారంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీపై అభ్యంతరాల సమర్పణ గడువు బుధవారం(జులై 5) సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కాగా, ఈ నెల 11వ తేదీన మళ్లీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను టిఎస్‌పిఎస్‌సి పగడ్భంధీగా నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన మొత్తం 2,33,056 మంది అభ్యర్థుల ఒఎంఆర్ షీట్లను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచింది. గత నెల 28వ తేదీన టిఎస్‌పిఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ ని విడుదల చేసి, ఈ నెల 1వ తేదీ నుంచి బుధవారం వరకు అభ్యంతరాలను స్వీకరించింది.

ప్రాథమిక కీ పై అభ్యర్థులు సమర్పించిన అభ్యంతరాలను ఆయా సబ్జెక్టు నిపుణులు పరిశీలించి తుది కీ ని ఖరారు చేయనున్నారు. అనంతరం రిజర్వేషన్లు, జోన్ల వారీగా మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రూప్1 ప్రిలిమరీ ఫలితాలు ఈ నెల చివరి వారంలో వెలువడే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తుది కీ ఖరారైన తర్వాత ఫలితాల ప్రక్రియను పూర్తి చేసి, మూడు నెలల సమయం ఇచ్చి ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేయనుంది. ఈ నేపథ్యంలో అక్టోబరు లేదా నవంబరు నెలల్లో గ్రూప్ -1 ప్రధాన పరీక్ష ఉండనున్నట్లు సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం ఇతర పరీక్షలు ఉండడంతో.. ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News