Wednesday, January 22, 2025

ప్రభుత్వ పథకాల లక్ష్యాలను పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ప్ర భుత్వ పథకాల లక్ష్యాలను అధికారులు ప్రజలకు చేర్చేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డేటా ఎంట్రీ హాల్‌లో బీసీ ఆర్థిక సహాయం, దళిత బంధు, రెండో విడత గొర్రెల పంపిణీ, హరితహారం, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ద శాబ్ది సంపద వనాల పై అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఏ వెంకట్ రెడ్డిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీసీ రుణాలను మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు అర్హులైన లబ్దిదారులను గుర్తించి త్వరితగతిన ప్రతిపాదనలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో బిసి ఆర్థిక సహాయం కొరకు 23,374 మంది దరఖా స్తు చేసుకోగా 17,985 దరఖాస్తులు పరిశీలించినట్లు తెలిపారు. మరో 5,389 దరఖాస్తులను పరిశీలన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత గొర్రెల పంపిణీ కొరకు 3317 మంది గొర్రె కాపరులు డీడీ చెల్లించారని వీరిలో 137 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేసినట్లు వివరించారు.

బీసీ ఆర్థిక సహాయం, దళిత బంధు, గొర్రెల పంపిణీ లక్ష్యాలను స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ఎంపిక జరగాలని సూచించారు. హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన దశాబ్ది సంపద వనాలలో ఇరిగేషన్ అధికారులు పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని, ఎక్కడైన సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల పై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సమావేశంలో జడ్పి సీఈఓ సురేష్, డిఆర్‌డిఏ పిడి కిరణ్‌కుమార్, డిపిఓ యాదయ్య, డిప్యూటీ డిఆర్డిఓ పెంటయ్య, ఎంపిడిఓలు, ఎంపిఓలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News