Friday, January 10, 2025

సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ కట్టడి చేయాల్సిందే: కేంద్ర మంత్రి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికలపై అశ్లీల, అసభ్యకర పోస్టులను కట్టడి చేసేందుకు ప్రస్తుత చట్టాలను మరింత కఠినం చేయవలసిన అవసరం ఉందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ్‌వ్ తెలిపారు. బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో బిజెపి సభ్యుడు అరుణ్ గోవిల్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ పార్లమెంటరీ స్తాయీ సంఘం ఈ అంశాన్ని చేపట్టాలని, ఈ విషయంలో మరింత కఠినమైన చట్టాలను రూపొందించేందుకు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రావాలని అన్నారు.

గతంలో సంపాదకవర్గం తనిఖీలు ఉండేవి. ఏది ఒప్పో ఏది తప్పు పరిశీలన తర్వాతే ప్రచురణ జరిగేది. కాని ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛకు సోషల్ మీడియా వేదికగా మారింది. అయితే దీనిపై నియంత్రణ లేదు. అశ్లీల కంటెంట్ వస్తోంది. అశ్లీల కంటెంట్‌ను నిర్మూలించేందుకు మరింత కఠినమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది అని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News