Monday, December 23, 2024

కాశీ మణికర్ణిక ఘాటులో తరాల ఆచారం

- Advertisement -
- Advertisement -

వారణాసి : కాశీలోని మణికర్ణిక ఘాట్‌లో అర్థరాత్రి తరువాత కొందరు యువతుల అర్థనగ్న నృత్యాలతో రాత్రంతా జాతర వాతావరణం నెలకొంది. వారణాసిలో ఇటువంటి అశ్లీలతనా? అని ప్రశ్నలు వెలువడ్డాయి. అయితే పడుపువృత్తిలో ఉండే నగర్ వధూ తెగ యువతులు ఈ శ్మశాన వాటికల ఘాట్‌లో తరతరాల నాటి తమ సంప్రదాయానికి అనుగుణంగా నృత్యాలు చేస్తారని నిర్వాహకులు తెలిపారు. శ్మశానవాటికలకు అధిపతి అయిన బాబా మహాశ్మశాన్ నాథ్ పేరిట ఇక్కడ మూడురోజుల పాటు శృంగార్ మహోత్సవం జరుగుతుంది.

ఈ సందర్భంగా చివరిరోజు మంగళవారం నగర్ వధూ తెగ మహిళలు వచ్చి నృత్యాలు చేయడం ఆనవాయితీగా ఉంది. చుట్టూ రగులుతున్న చితి మంటల మధ్య ఇక్కడ చైత్ర నవరాత్రి ఉత్సవాలు సాగుతాయి. చితిమంటల వెలుగులు, మరో వైపు మండుతున్న కట్టెలు, మానవ మృతకళేబరాలు చప్పుళ్లు మధ్య పలువురు యువతులు నృత్యాలు చేస్తారు. తాము ఆచరిస్తోన్న పడువు వృత్తినుంచి విముక్తి దక్కాలని, పాపాలు తొలిగిపోవాలని వీరు ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఈ ఘడియలలో రాత్రిపూట నాట్యాలకు దిగడం తరాల నాటి వీరి వంశాచారం అని నిర్వహకులు గుల్షన్ కపూర్ తెలిపారు. ఐదు శతాబ్దాలుగా ఈ తంతు సాగుతోందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News