Wednesday, January 22, 2025

రాహుల్ గాంధీ సభాస్థలం పరిశీలన

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ప్రజలు బ్రమ్మరథం పడుతున్నారని,ఆ పాదయాత్ర ఈ నెల 28న ఖమ్మం జిల్లాకు చేరుకుంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సంభానీ చంద్ర శేఖర్ అన్నారు.ఖమ్మం జిల్లా కాంగ్రేస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సాంబాని చంద్రశేఖర్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాడ దుర్గాప్రసాద్ నగర పార్టీ అధ్యక్షులు జావిద్ ప్రతినిధి బృందం ఆదివారం జూలై రెండున జరిగే భారీ బహిరంగ సభ స్థలాన్ని ఎస్‌ఆర్ అండ్ బిజియన్‌ఆర్ కళాశాల, సర్దార్ పటేల్ స్టేడియం ను పరిశీలించారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అదిలాబాదు జిల్లా బొద్ నియోజకవర్గంలో ప్రారంభమైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 15 జిల్లాలు ముగించుకుని ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తుందని,ఈ పాదయాత్ర ముగింపు సభను ఖమ్మం నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ భారీ భహిరంగ సభను 3లక్షల మంది కార్యకర్తలతో నిర్వహించనున్నామని,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏఐసీసీ ఛీఫ్ రాహుల్ గాంధీ హాజరవుతారని,ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్నీ సెగ్మెంట్స్ నుండి సభకు భారీగా ప్రజలు హాజరు కాబోతున్నారని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News