లండన్ : కరోనా నివారణ నిబంధనల్లో భాగంగా గత రెండేళ్లుగా వాడుతున్న క్లాత్ మాస్క్‌ల ప్రభావంపై ఇంగ్లండ్ లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ట్రిష్ గ్రీన్‌హాల్గ్ పరిశీలన జరిపారు. ఈ మేరకు అనేక విషయాలు వెల్లడించారు. రెండు మూడు పొరలతో ఉండే క్లాత్ మాస్కులు ప్రభావ వంతంగా పనిచేస్తాయని, అయితే వాటి తయారీలో ఫ్యాషన్కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటోందని, వాటిని అలంకరణ వస్తువుగా చూస్తున్నారని పేర్కొన్నారు. క్లాత్ మాస్కులతో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే వాడే క్లాత్ విషయంలో ఎలాంటి వైద్య ప్రమాణాలు పాటించాల్సిన అవసరం లేదు. అదే ఎన్ 95 మాస్కుల తయారీదారులు మాత్రం తమ మాస్కులు 95 శాతం కణాలను వడపోస్తాయని నిర్ధారించుకోవాల్సి ఉంది. మాస్కులు పనితీరు ఎంత గొప్పగా ఉన్నా ముక్కు, నోటిని వాటితో సరిగా మూయక పోతే అంతా నిష్ప్రయోజనమే. అదే సమయంలో సరిగా శ్వాస తీసుకోవాల్సిన అవసరమూ ఉందని ట్రిష్ పేర్కొన్నారు.
క్లాత్ మాస్కుల ప్రభావంపై పరిశీలన
- Advertisement -
- Advertisement -
- Advertisement -