Monday, December 23, 2024

భారత్ ఎన్నికలను గమనిస్తున్నాం: జర్మన్ రాయబారి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌లో ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచం లోనే అతి పెద్ద ఎన్నికలను జర్మనీ ఆసక్తిగా గమనిస్తోందని ఆ దేశ రాయబారి ఫిలిప్ అకెర్‌మాన్ అన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రభావం మరింత పెరుగుతుందన్నారు. సోమవారం ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో ఫిలిప్ పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. భారత్ ప్రభావం ఏమిటో జి 20 సదస్సుకు న్యూఢిల్లీ ఆతిథ్యమిచ్చినప్పుడే తమకు అర్ధమైందని తెలిపారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన జి20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించిందని గుర్తు చేశారు. ఈ సదస్సుకు సంబంధించి మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 60 నగరాల్లో రెండువందలకు అనుబంధ సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రపంచ దేశాల్లో కేవలం భారత్‌కు మాత్రమే ఇది సాధ్యమని అన్నారు. ఇరాన్‌ఇజ్రాయెల్, రష్యాఉక్రెయిన్ యుద్ధాల గురించి ప్రస్తావిస్తూ ప్రపంచం మొత్తం మీద ఇలాంటి సంక్లిష్ట సమస్యలు నెలకొన్నాయని, అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ కీలక పాత్ర వహించగలదని తాము భావిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News