Monday, December 23, 2024

గాజాలో ప్రపంచ ఆహార కార్యక్రమానికి అడ్డంకులు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : గాజాను అన్నివైపుల నుంచి పూర్తిగా మూసివేయడంతో ఇప్పుడు అక్కడ ప్రపంచ ఆహార కార్యక్రమం నిర్వహించడం కష్టంగా మారిపోయింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి హ్యూమనిటేరియన్ ఆర్గనైజేషన్ ప్రాంతీయ డైరెక్టర కొరిన్ ఫ్లీషర్ వెల్లడించారు. గాజాలో ఆహార నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయని చెప్పారు. గాజా బయట దాదాపు 13 లక్షల మంది రెండు వారాల పాటు కడుపు నింపగలిగినంత ఆహార సామగ్రి నిలిచిపోయిందని వెల్లడించారు.

కానీ అవి ఇప్పటికీ సురక్షితంగా గాజా లోకి చేరుకొనే పరిస్థితి లేదని వెల్లడించారు. “ వాటిని తరలించడం కోసం మేము అన్ని వర్గాలతో చర్చలు జరిపాము. ఎవరి నుంచి ఇప్పటివరకు సానుకూల స్పందన లభించలేదు. మేము సురక్షితంగా సరిహద్దులు దాట గలగాలి. మాకు సురక్షితమైన పంపినీ కారిడార్లు కావాలి. అప్పుడే శరణార్థి శిబిరాలకు వెళ్లి ఆహారం సరఫరా చేయగలం. ఇప్పటికే చాలా సమయం మించిపోయింది.

ప్రజలు ఆకలితో ఉన్నారు” అని ఫ్లీషర్ వెల్లడించారు. ప్రపంచ ఆహార కార్యక్రమం కింద గాజాలో 5,20,000 మందికి క్యాన్లలో ఆహారం, రొట్టెలు, నగదు అందిస్తున్నారు. కానీ ప్రస్తుతం గాజాలో పరిస్థితుల కారణంగా ఆదివారం నాటికి మరో 2,24,000 మందికి ఆహారం అందించాల్సిన పరిస్థితి రావచ్చని భావిస్తున్నారు. చాలామంది శరణార్థులు, ఆహారం, నీరు, బాత్‌రూమ్‌లు , విద్యుత్, లేకుండా జీవిస్తున్నారని ఫ్లీషర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News