యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘన
అక్రమ బ్లాస్టింగులు
బీటలు వారుతున్న గ్రామాలు
అక్రమంగా గ్రానైట్ తరలింపు
లక్షల్లో జీరో వ్యాపారం?
పట్టించుకోని మైనింగ్ అధికారులు
కర్నాటకలో గతంలో ఓబులాపురం గనుల అవినీతి చరిత్ర తెలియని వారు ఉండరు. ఈ ఓబులాపురం గనులపై నిత్యం పేపర్లో వార్త కథనాలు వచ్చాయి. కోట్లలో అవినీతి జరిగిందని రుజువు కావడంతో ఆ గని యజమాని జైలు జీవితం కూడా గడిపిన విషయం తెలిసిందే. అచ్చం అలాగే భూత్పూర్ మండలంలోని మల్లయ్య గుట్ట వద్ద మరో ఓబులాపురం గనిని తలదన్నే విధంగా అక్రమ గనుల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. చూస్తేనే అదో సింగరేణి గనుల్లాగా కనిపిస్తాయి. నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘించి అక్రమంగా గ్రానైట్ తవ్వుకు పోతున్నా పట్టించుకునే నాధుడే లేడు. తనఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నట్లు నికులు ఆరోపిస్తున్నారు.
– మన తెలంగాణ/ మహబూబ్ నగర్ బ్యూరో
ఈ గని హైదరాబాద్‌కు చెందిన వెంకటేష్ యాదవ్ అనే వ్యక్తికి లీజు లైసన్స్ ఉంది. ఈ గనిని మరో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి సబ్ లీజు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ గ్రానైట్ తవ్వకాల్లో పలు అక్రమాలు, బ్లాస్టింగులు జరుపుతున్నారు. వీరికి రాజకీయ పలుకుబడి ఉండడంతో నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘీస్తున్నారన్న ఆరోపణలు ఉన్నా యి. నిబంధనలు ప్రకారం గనిలోని గ్రానైట్ ను తవ్వకోవాలంటే ముందుగా అక్కడ ఏ గ్రానైట్ పడుతుందో మైనింగ్ అండ్ జువాలజి శాఖ వారు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. గ్రానైట్‌కు దూరంగా పల్లెలు ఉండే ప్రాంతాల్లో మాత్రమే అనుమతి ఇవ్వాలని, గ్రానైట్ తవ్వకాల వలన రైతుల పొలాలకు, కాని , పల్లెలకుకాని, ప్రజలకు కాని ఎటువంటి హాని, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాల్సి ఉంటుంది.
గ్రా నైట్ ఎంతమేరకు తవ్వకోవాలో స్పష్టంగా ఎత్తు, లోతు, మీటర్ల వారీగా స్పష్టంగా ఉంటు ంది. గ్రానైట్ తరలింపుకు ఫీజు ప్రభుత్వంకు ఇవ్వాల్సి ఉంటుంది. రోడ్ సౌకర్యంగా ఉండా లి, బ్లాస్టింగ్‌కు పోలీసుల అనుమతి ఉండాల్సి ఉంటుంది. బ్లాస్టింగ్ వలన గ్రామాలకు ఎటువంటి హాని జరగకూడదని, తరలించే ప్రతి వాహనానికి కాటా ఉంచి,మైనింగ్ అధికారు లు జారీ చేసే ఆర్వో ఉండాలని, ఇలా అనేక ని బంధనలు ఉండాల్సి ఉంటుంది, ఇక్కడ మాత్రం ఎటువంటి నిబందనలు కాన రావడం లే దు. ఇష్టాను సారంగా గ్రానైట్‌ను తరలించుకుపోతున్నారు. 40 ఎంఎం, 20 ఎంఎంతో పాటు రోడ్లకు వేసి చిప్స్‌కూడా తయారు చేస్తున్నారు.ఇందుకు పెద్ద పెద్ద కంకర క్వారీలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి కంకర, చిప్స్‌ను ఇతర జిల్లాలకు కూడా తరలించుకుపోతున్నారు. లక్షల్లో వెనుకేసుకుంటున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
గ్రామాల ఇళ్లకు బీటలు:
క్వారీ బాట్లగడ్డ తండా,లంబడికుంట, మొల్గ ర, మల్లయ్య గుట్ట తదితర గ్రామాల్లో ఈ గను ల్లో అక్రమంగా జెలిటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్టింగులు చేపడుతున్నట్లు గ్రామస్దులు ఆరోపిస్తున్నారు. ఈ బ్లాస్టింగులకు రాత్రిళ్లు ఇళ్లుకు బీటలు వాలుతున్నాయని, శభ్దానికి పిల్లలు బయాందోలనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. బ్లాస్టింగ్ వలను చుట్టు ఉన్న రైతుల పొలాల్లో రాతి పొడి పొగ పడి పంటలు నాశన ం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చుట్టు వ్యవసాయం చేయలేక పోతున్నామని చెబుతున్నారు. మట్టి రోడ్‌పై పెద్ద పెద్ద బెంజుల ద్వారా గ్రానైట్‌ను తీసుకుపోవడంతో దారులు పాడైపోతున్నాయని వాపోతున్నారు. అధికారులకు ఎన్ని సార్లు విన్నించుకున్నా స్పదించడం లేదని వాపోతున్నారు. ఈ గ్రానైట్ ఒబులాపురం గని లాగ వందల మీటర్ల లోతు వరకు తవ్వతున్నారని చెబుతున్నారు. నిబందనల ప్రకారం ఎంత లోతుకు తీయాలన్నది ఉంటుందని కాని ఇక్కడ ఇష్టం వచ్చినట్లు తవ్వుకుంటున్నారు.
ఎవరూ సమాచారం ఇవ్వరు …
ఈ మైనింగ్‌పై ఎవరూ సమాచారం ఇవ్వడం లేదు.మన తెలంగాణ ప్రతినిది ఈ గ్రానైట్ య జమాని, సూపర్ వైజర్, అకౌంటెంట్‌కు ఫోన్ ద్వారా వివరణ కోరినా స్పందించలేదు.అంతా బీహారి కూలీలను నియమించుకొని ఇష్టమొచ్చినట్లు తవ్వకుంటున్నారు. లోపలకి ఎ వరు పో వాలన్నా అనుమతి తీసుకొని పోవాల్సి ఉంటు ంది. ఇక్కడ అంతా లోకల్ నాయకుడే నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఈ గనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.