Sunday, December 22, 2024

డబ్బు ఎవరిది? అదానీదేనా? ఇంకెవరిదైనా?: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

ముంబయి: అదానీ గ్రూప్‌పై ఒసిసి ఆర్ రిపోర్టు వచ్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈ రిపోర్టులు దేశ ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. అదానీ గ్రూప్ అక్రమాలపై పలు పత్రికల్లో కథనాలు వచ్చాయని, బిలియన్ డాలర్ల ధనం ఇండియా నుంచి ఎక్కడికి వెళ్లిందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మళ్లీ వివిధ మార్గాల్లో ఇండియాకు వచ్చినట్టు కథనాలు వెలువడ్డాయని, ఈ డబ్బు ఎవరిది? అదానీదేనా? ఇంకెవరిదైనా? ఉందా? అని అడిగారు. అదానీకి క్లిన్‌చిట్ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎన్‌డిటివి డైరెక్టర్‌గా పని చేస్తున్నారని, జెపిసి వేసి సమగ్ర విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News