Tuesday, April 15, 2025

నాగ సాధువుగా తమన్నా అద్భుతమైన నటన

- Advertisement -
- Advertisement -

తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ’ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలా గ్ రైటర్ గా మల్టిపుల్ రోల్స్‌లో వర్క్ చేశారు. అలాగే డైరెక్షన్ సూపర్ విజన్‌ని అందిస్తున్నారు. అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్ బ్యానర్స్ పై డి.మధు నిర్మిస్తున్నారు. ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. నాగ సా ధువుగా తమన్నా భాటియా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయి న్ తమన్నా మాట్లాడుతూ “ సంపత్ నంది ఈ సినిమాలో నా పాత్రని రాసిన విధానం చాలా అద్భుతం గా ఉంటుంది. వశిష్ట సింహ తన అద్భుతమైన నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఈ సినిమాలో నేను చేసిన శివశక్తి పాత్రకు ఎలాంటి రిఫరెన్స్ లేదు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది”అని అన్నారు. మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ “రచ్చ సినిమా నుంచి తమన్నాతో జర్నీ ఉంది. తను అద్భుతమైన నటి. ఈ సినిమాలో శివశక్తి పాత్రని మరో స్థాయిలో చే శారు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత డి.మధు, వశిష్ట సింహ, ఆదిత్య భాటియా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News