Wednesday, April 16, 2025

అరుంధతి, అమ్మోరు లాంటి ‘ఓదెల 2’

- Advertisement -
- Advertisement -

తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్‌పై డి మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నా రు. హెబ్బా పల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్స్‌లో విడుదల కా నుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చార్మింగ్ స్టార్ శర్వా చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్‌లో హీరో శర్వా మాట్లాడుతూ “ఓదెల 2 టీజర్ చూడగానే అరుంధతి, అమ్మోరు సినిమాలు చూసిన ఫీలింగ్ వచ్చింది. ఏదో మ్యాజిక్ జరగబోతుందనే ఫీలింగ్ నాకుంది. తమన్నా వండర్‌ఫుల్ ఆర్టిస్ట్. రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా ఉండడం మామూలు విషయం కాదు. ఒక మాస్ సినిమాకి ఎలా అయితే ఎదురు చూస్తారో ఈ సినిమా కోసం ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు”అని అన్నారు. హీరోయిన్ తమన్నా భాటియా మాట్లాడుతూ “ఈ సినిమాలో భాగం కావ డం అదృష్టంగా భావిస్తున్నాను. శివశక్తి పాత్ర, ఈ సినిమా నా కెరీర్‌లో చాలా స్పెషల్‌గా ఉండబోతుంది.

వశిష్ఠ అద్భుతంగా నటించారు. అజినీష్ ఈ సినిమాకి సోల్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు”అని తెలిపారు. డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ “డైరెక్టర్ అశోక్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. నిర్మాత మధు లేకపోతే ఈ కథ లేదు. ఆయన వల్లే ఈ జర్నీ సాధ్యమైంది”అని తెలియజేశారు. డైరెక్టర్ అశోక్ తేజ మాట్లాడుతూ నాగ సాధువుగా తమన్నా చాలా అద్భుతంగా నటించారని పేర్కొన్నా రు. నిర్మాత డి.మధు మాట్లాడుతూ “మంచికి చెడుకు మధ్య జరిగే యుద్ధం ఈ సిని మా. ఆడియన్స్ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుంది”అని అన్నారు. ఈ కా ర్యక్రమంలో వశిష్ట ఎన్ సింహా, రాధా మో హన్, రాజీవ్ నాయర్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News