Friday, December 20, 2024

వన్డేలలో నంబర్ వన్ బౌలర్ సిరాజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐసిసి వ్యక్తిగత వన్డే ర్యాంకులను విడుదల చేసింది. వన్డే ర్యాంకింగ్‌ల్లో నంబర్ వన్ బౌలిర్‌గా సిరాజ్ నిలిచాడు. హైదరాబాద్ బౌలర్ సిరాజ్ ఇటీవల నిలకడగా రాణిస్తున్నాడు. ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ అద్భత ప్రదర్శన చేశాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో సిరాజ్ నాలుగు వికెట్లు తీసి అబ్బురపరిచాడు. టి20లో రషీద్ ఖాన్, వన్డేలలో సిరాజ్, టెస్టులలో రవిచంద్రన్ అశ్విన్ తొలి స్థానంలో ఉన్నారు. టెస్టులలో మూడో స్థానంలో రవీంద్ర జడేజా, పదో స్థానంలో బుమ్రా ఉన్నారు.

Also Read: తెలంగాణ వ్యతిరేకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గండ్రా

టి20లో బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్ తొలి స్థానం, రిజ్వాన్ రెండో స్థానం, వన్డేలలో తొలి స్థానం బాబర్ అజమ్, రెండో స్థానం శుభ్ మన్ గిల్, ఎనిమిదో స్థానంలో విరాట్ కోహ్లీ, పదో స్థానంలో రోహిత్ శర్మలు ఉన్నారు. టెస్టుల్లో ఇంగ్లాండ్‌కు చెందిన జోయ్ రూట్ తొలి స్థానంలో, పదో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నారు. టెస్టు, టి20లలో టీమిండియాలో తొలి స్థానంలో ఉండగా వన్డేలలో పాకిస్థాన్ తొలి స్థానం, టీమిండియా రెండో స్థానంలో ఉంది. వన్డేలలో పాక్, ఇండియాలో 115 పాయింట్లలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News