Friday, December 20, 2024

ప్రపంచకప్‌ 2023: టీమిండియాపై బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్..

- Advertisement -
- Advertisement -

చెన్నై: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరుజట్లకు ఇదే తొలి మ్యాచ్. ఆరంభ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని పట్టుదలగా ఉన్నాయి.

రెండు జట్లను కూడా గాయాల సమస్య వెంటాడుతోంది. టీమిండియాలో శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యలు గాయాలతో సతమతమవుతున్నారు. ఈ మ్యాచ్‌లో వీరు ఆడుతారా లేదా అనేది కాస్త సందేహంగా మారింది. హార్దిక్ బరిలోకి దిగే అవకాశాలున్నా గిల్ తొలి మ్యాచ్‌కు కష్టమేనని సమాచారం. ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించే ఛాన్స్ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News