- Advertisement -
రానున్న ప్రపంచకప్‌లో భారత్‌కు ట్రోఫీ సాధించడం అనుకున్నంత తేలికేం కాదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. గతంతో పోల్చితే ప్రస్తుతం భారత్ కాస్త బలహీనంగా కనిపిస్తుందన్నాడు. కీలక ఆటగాళ్లు ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఇలాంటి స్థితిలో వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడం సులువు కాదన్నాడు. అయితే కోహ్లి, రోహిత్, బుమ్రా, జడేజా వంటి స్టార్ ఆటగాళ్లు ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశమన్నాడు.
- Advertisement -